అల్లు అర్జున్(Allu Arjun) అభిమానులకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ షాక్ ఇస్తున్నారు. ప్రభుత్వంపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై చర్యలకు దిగుతున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై అనుచిత పోస్టులు పెట్టిన కొంతమంది బన్నీ ఫ్యాన్స్‌పై కేసులు నమోదుచేశారు. దీంతో పోలీసులు తీరుపై అభిమానులు మండిపడుతున్నారు. కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అనంతరం మధ్యంతర బెయిల్‌పై విడుదలైన విషయం విధితమే.
మరోవైపు ఈ ఘటకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్‌కు కూడా పోలీసులు షాక్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. బన్నీ మధ్యంతర బెయిల్ రద్దుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఇందుకోసం ఉన్నతాధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు పోలీస్ వర్గాల్లో వినిపిస్తోంది.