టీమిండియా సీనియర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముగిసిన అనంతరం మీడియా సమావేశంలో రిటైర్మెంట్ ఇస్తున్నట్లు అశ్విన్ ప్రకటించాడు. అంతకుముందు డ్రెస్సింగ్ రూమ్‌లో విరాట్ కోహ్లీతో అశ్విన్ భావోద్వేగానికి గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాగా తన కెరియర్‌లో మొత్తం 106 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్.. 537 వికెట్లు తీశారు. బ్యాటింగ్‌లో 3503 పరుగులు చేశారు. ఇందులో ఆరు సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిసన రెండో బౌలర్‌గా అశ్విన్ రికార్డు సృష్టించాడు. తొలి స్థానంలో దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే(617) ఉన్నారు.