తెలుగుదేశం పార్టీ(TDP) అధికారిక యూట్యూబ్(Youtube) ఛానల్ హ్యాకింగ్‌కు గురైంది. బుధవారం ఉదయం నుంచి ఛానల్‌లో అంతరాయం ఏర్పడింది. ఛానల్ ఆన్ చేస్తే ఓపెన్ కావడం లేదని టీడీపీ నేతలు తెలిపారు. దీంతో ఏమైందో తెలుసుకోవడానికి పార్టీ టెక్నికల్ వింగ్ రంగంలోకి దిగింది. మరోవైపు దీనిపై పార్టీ వర్గాలు యూట్యూబ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాయి.
- Advertisement -
ఛానల్ పునరుద్ధరణకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు. అయితే కావాలనే ఎవరైనా హ్యాక్ చేశారా..? లేదంటే యూట్యూబ్ యాజమాన్యమే ఛానల్‌ను బ్లాక్ చేసిందా..? అనేది తెలియాల్సి ఉంది. కాగా పార్టీతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలను ఈ ఛానల్‌లో ప్రసారం చేస్తూ ఉంటారు.