ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు(Dil Raju)తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా(TFDC) పదవీకి ప్రమాణ శ్రీకారం చేశారు.హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ వద్ద FDC కాంప్లెక్స్‌లోని కార్యాలయంలో నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. నేటి నుంచి రెండేళ్ల పాటు ఆయన ఈ పదవీలో కొనసాగనున్నారు. ఇవాళ దిల్ రాజు పుట్టిన రోజు సందర్భంగా బాధ్యతలు స్వీకరించడం విశేషం.
దిల్‌రాజు అసలు పేరు వెలమకుచ వెంకటరమణారెడ్డి. అయితే సినిమాల మీద ఆసక్తితో తొలుత డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించారు. అనంతరం ‘దిల్’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఆ సినిమా సక్సెస్ కావడంతో ఆయన పేరు దిల్ రాజుగా మారింది. అప్పటి నుంచి విజయవంతమైన సినిమాలు నిర్మిస్తూ టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతగా ఎదిగారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆయనకు కీలక పదవి కేటాయించింది.
ప్రస్తుతం దిల్ రాజు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. ఆయన నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్నాయి. అలాగే నితిన్, వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘తమ్ముడు’ సినిమాకు కూడా ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.