Wednesday, December 18, 2024
Homeకెరీర్TET Exams: తెలంగాణ టెట్‌ షెడ్యూల్‌ విడుదల

TET Exams: తెలంగాణ టెట్‌ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ టెట్‌ షెడ్యూల్‌ను(TET Schedule) పాఠశాల విద్య శాఖ విడుదల చేసింది. జనవరి 2 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు.. మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.

- Advertisement -

డిసెంబర్ 26వ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. హాల్ టికెట్ల కోసం https://tstet2024.aptonline.in/tstet/ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. టెట్ పరీక్షలు రాసేందుకు మొత్తం 2,48,172 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్‌-1కు 71,655, పేపర్‌-2కు 1,55,971 దరఖాస్తులు వచ్చాయి. అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 91 7075028882 / 85 నెంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News