Wednesday, December 18, 2024
HomeతెలంగాణKTR: ఫార్ములా-ఈ రేస్‌పై అసెంబ్లీలో చర్చ పెట్టండి.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ

KTR: ఫార్ములా-ఈ రేస్‌పై అసెంబ్లీలో చర్చ పెట్టండి.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ

KTR: దమ్ముంటే ఫార్ములా-ఈ రేస్ అంశంపై రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ లేఖ రాశారు. ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ అంశంపై ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో గంటన్నర పాటు చర్చ జరిగినట్టు వార్తా కథనాలు వస్తున్నాయన్నారు. ఈ విషయం మీద నాలుగు గోడల మధ్య చర్చ కన్నా రాష్ట్ర శాసనసభలో ప్రజాస్వామ్యవిధానంలో, ప్రజల ముందే చర్చ జరిగితే నిజానిజాలు తెలుస్తాయని సూచించారు.

- Advertisement -

రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మంచి జరగాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం ఫార్ములా-ఈ రేస్ నిర్వాహకులతో ఒక పారదర్శక ఒప్పందం కుదుర్చిందన్నారు. ఈ రేస్ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.700 కోట్ల లబ్ది చేకూరిందని నీల్సన్ సంస్థ నివేదిక స్పష్టం చేసిందని తెలిపారు. 2024లో మరో దఫా రేస్ జరగాల్సి ఉండగా మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దానిని ఏకపక్షంగా రద్దు చేసిందన్నారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఫార్ములా-ఈ రేస్ గురించి అనేక అవాస్తవాలను ప్రచారం చేసి, అనవసర అపోహలు కలిగించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రేస్ నిర్వాహకులకు చెల్లింపులు కూడా నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా జరిగినట్లు ఇప్పటికే వివరణ ఇచ్చానని చెప్పుకొచ్చారు.
దీనిపై రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలుసుకునే హక్కు ఉందని..అందువల్ల ఈ అంశంపై శాసనసభలో చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తున్నానని లేఖలో వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News