Wednesday, December 18, 2024
HomeఆటKurnool: విజేతలై రావాలి

Kurnool: విజేతలై రావాలి

ఛాంపియన్స్

ఇంటర్ యూనివర్సిటీ ఫుట్ బాల్ టోర్నమెంట్ లో విజేతలై తిరిగి రావాలని క్లస్టర్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ డివిఆర్ సాయి గోపాల్ అన్నారు. ఈనెల 21 నుండి 28 వరకు కేరళ రాష్ట్రంలోని కాలికట్ లో జరగనున్న ఫుట్ బాల్ టోర్నమెంట్ కు వెళ్లే క్లస్టర్ యూనివర్సిటీ 18 మంది క్రీడాకారులకు బుధవారం వర్సిటీ వీసీ ఆచార్య డివిఆర్ సాయి గోపాల్, రిజిస్ట్రార్ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు స్పోర్ట్స్ డ్రెస్ ను అందజేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడితే ఏదైనా సాధిస్తారని, చదువుతోపాటు క్రీడలపై శ్రద్ధ వహించాలన్నారు. క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు, మానసిక స్థైర్యం పెరుగుతుందని, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉందన్నారు. ఫుట్ బాల్ క్రీడలో మంచి ప్రతిభ కనబరిచి విజేతలై తిరిగి రావాలని ఆకాంక్షించారు. రిజిస్ట్రార్ మాట్లాడుతూ యూనివర్సిటీ పరిధిలో క్రీడలకు మరింత ప్రోత్సాహం అందిస్తామన్నారు.

స్పోర్ట్స్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొనేందుకు 18 మంది సభ్యులు, ఇద్దరు కోచ్ లు వెళతారన్నారు. కార్యక్రమంలో డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం డాక్టర్ పక్కీరయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News