తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మాజీ టీమ్ ఇండియా క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండలంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల వీరేందర్ సెహ్వాగ్ ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.