Wednesday, December 18, 2024
Homeఆంధ్రప్రదేశ్AP Highcourt: హోంగార్డులకు ఏపీ హైకోర్టులో ఊరట

AP Highcourt: హోంగార్డులకు ఏపీ హైకోర్టులో ఊరట

రాష్ట్రంలో హోంగార్డులకు(Home Guard) ఏపీ హైకోర్టులో(AP Highcourt) ఊరట లభించింది. కానిస్టేబుళ్ల భర్తీలో హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని స్టేట్‌ లెవెల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆరు వారాల్లో ప్రత్యేక మెరిట్‌ జాబితా తయారీ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. దీంతో కోర్టు తీర్పుపై హోంగార్డులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

కాగా పోలీసు కానిస్టేబుళ్ల ఎంపిక కోసం నిర్వహించిన ప్రాథ‌మిక రాత ప‌రీక్షల్లో క‌నీస మార్కులు రావాల్సిందేన‌ని రాష్ట్రస్థాయి పోలీసు నియామ‌క బోర్డు(SLPRB) ఇటీవల స్పష్టం చేసింది. ప్రాథ‌మిక రాత ప‌రీక్షలో క‌నీస అర్హత మార్కులు సాధించ‌లేదంటూ త‌మ‌ను అన‌ర్హులుగా ప్రక‌టించార‌ని ప‌లువురు హోంగార్డులు హైకోర్టులో పిటిష‌న్లు దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్లపై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు వారిని దేహ‌దారుఢ్య, తుది రాత ప‌రీక్షల‌కు అనుమ‌తించాల‌ని SLPRBని ఆదేశిస్తూ నవంబర్ 12న మ‌ధ్యంతర ఉత్త‌ర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను నేటికి వాయిదా వేయగా.. కానిస్టేబుళ్ల భర్తీలో హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News