Tuesday, March 11, 2025
HomeతెలంగాణBJP MLAs: ఎడ్లబండిపై అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు

BJP MLAs: ఎడ్లబండిపై అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల(Telangana Assembly) నేపథ్యంలో విపక్షాలు వినూత్నంగా నిరసనలు చేపడుతున్నాయి. ఓవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లగచర్ల రైతుల అరెస్ట్‌కు నిరసనగా నల్ల చొక్కాలు, చేతికి బేడీలతో.. అలాగే ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ఆటో డ్రైవర్ల యూనిఫాం ధరించి ఆటోల్లో అసెంబ్లీకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ ఎమ్మెల్యేలు(BJP MLAs) రైతుల సమస్యలను తీర్చాలంటూ ఎడ్లబండిపై అసెంబ్లీకి వచ్చారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. రైతుల సమస్యలపై సభలో చర్చించేందుకు ప్రభుత్వానికి సమయం లేదా అని మండిపడ్డారు. అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.2లక్షల రుణమాఫీ నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రైతు భరోసా (Raithu Bharosa) పథకాన్ని వెంటనే అమలు చేయాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News