Thursday, December 19, 2024
Homeచిత్ర ప్రభBalagam Mogilaiah: 'బలగం' మొగిలయ్య కన్నుమూత

Balagam Mogilaiah: ‘బలగం’ మొగిలయ్య కన్నుమూత

ప్రముఖ జానపద కళాకారుడు ‘బలగం’ మొగిలయ్య(Balagam Mogilaiah) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల దర్శక నిర్మాతలు వేణు, దిల్‌ రాజు, ఇతర ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు.

- Advertisement -

కాగా తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన ‘బలగం’ సినిమా క్లైమాక్స్‌లో తన పాట ద్వారా మొగిలయ్య మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కొన్ని రోజులుగా కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు చికిత్స కోసం మెగాస్టార్ చిరంజీవి, బలగం దర్శకుడు వేణు ఆర్థికసాయం చేశారు. కొద్దిగా కోలుకుంటున్నట్లు కనిపించిన ఆయన ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వరంగల్‌లోని సంరక్ష ఆస్పత్రికి ఆయన్ను తరలించారు. మొగిలయ్య మరణంతో స్వగ్రామం దుగ్గొండిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News