రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) చేసిన అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే ఇతర ఇండియా కూటమి పార్టీలు ధర్నా నిర్వహించాయి. ఈ క్రమంలోనే షా వ్యాఖ్యలపై ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్డీఏ మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ సీఎంలు చంద్రబాబు(Chandrababu), నితీశ్ కుమార్‌లకు లేఖ రాశారు.
అంబేద్కర్ గురించి అమిత్ షా వ్యాఖ్యలపై మీ స్పందన ఏమిటో తెలియజేయాలని కోరారు. అంబేద్కర్ కేవలం నాయకుడు మాత్రమే కాదని..భారత జాతికి ఆత్మ అని తెలిపారు. ఇప్పటివరకు కనీసం అమిత్ షా క్షమాపణలు కూడా చెప్పలేదన్నారు. ప్రధాని మోదీ(PM Modi) కూడా ఆయనను సమర్థిస్తున్నట్లు ఉందని లేఖలో పేర్కొన్నారు. మీరు ఈ అంశంపై లోతుగా ఆలోచించాలని ప్రలు ఆశిస్తున్నారు అంటూ ఆయన వెల్లడించారు.