Vande Bharat Express: వైజాగ్ నుంచి విజయవాడకు హైస్పీడ్ ట్రైన్ రానుంది. త్వరలోనే ఈ రూట్ లో ఒక ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ను నడపాలని భారతీయ రైల్వే యోచిస్తోంది. ఆంధ్రా- తెలంగాణాలను కలుపుతూ హైస్పీడ్ రైల్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు భారతీయ రైల్యే యోచిస్తోంది. అందులో భాగంగా ముందుగా వైజాగ్ నుంచి విజయవాడకు ఈ హైస్పీడ్ రైలు మొదలు పెట్టి ఆ తర్వాత సికింద్రాబాద్ వరకు పొడగిస్తారు. ఈ రైలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ తరహాలో పగటిపూట నడిచే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం 12 నుంచి 14 గంటలు ఉండగా.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి వస్తే ఈ సమయం 8 నుండి 4 వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ రైలు వేగానికి ప్రస్తుత ట్రాక్ సామర్థ్యం సరిపోతుందని అధికారులు అంచనా వేస్తుండగా త్వరలోనే 8 కోచ్ ల ఈ రైలు విశాఖకు రానుంది. ముందుగా ట్రయిల్ రన్ నిర్వహించి ఆ తర్వాతే పట్టాలెక్కించనున్నారు.
ఇప్పటికే దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు సంబంధించి ఆధునిక వసతులతో ప్రధాన కార్యాలయ భవన నిర్మాణాన్ని వేగంగా చేపట్టాలని రైల్వే మంత్రి స్పష్టం చేశారు. ఇందులో చైర్ కార్ రూ.850, ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో రూ.1650 వరకు ధర ఉండే ఛాన్స్ ఉండగా ఆయా రూట్లలో ప్రస్తుత ట్రాఫిక్, ప్రయాణికుల డిమాండ్ వంటి సాంకేతిక