ఆల్ ఇండియా పోలీస్ కోకో ఛాంపియన్ షిప్ కు ఎంపికైన కానిస్టేబుల్ ను జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు. జిల్లా ఆర్మ్డ్ రిజర్వుడు విభాగంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న తుడి మల్లేశం ఆగస్టు 18 న జరిగిన తెలంగాణ పోలీస్ కోకో సెలక్షన్ విభాగంలో జగిత్యాల జిల్లా పోలీసు శాఖ తరఫున పాల్గొని పంజాబ్ రాష్ట్రంలో జరిగే ఆలిండియా కోకో పోలీస్ క్రీడలకు ఎంపిక అయ్యారు. తెలంగాణ పోలీస్ శాఖ నుండి కోకో విభాగంలో ఆల్ ఇండియా పోలీస్ క్రీడలకు ఎంపికైనందుకు మల్లేశంను ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు కిరణ్ కుమార్,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Jagityala: కానిస్టేబుల్ ను అభినందించిన జిల్లా ఎస్పీ
ఆల్ ఇండియా పోలీస్ కోకో ఛాంపియన్ షిప్ కు ఎంపికైన..