Thursday, December 19, 2024
HomeNewsNara Bhuvaneshwari: బాలకృష్ణ నా తమ్ముడే కాదు: నారా భువనేశ్వరి

Nara Bhuvaneshwari: బాలకృష్ణ నా తమ్ముడే కాదు: నారా భువనేశ్వరి

ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను(Nara Lokesh) తాను చాలా పద్ధతిగా పెంచానని.. అందుకే తనను హిట్లర్ అని పిలుస్తారని ఆయన తల్లి నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) తెలిపారు. కుప్పం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులతో ఆమె ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా తన ఇంట్లో విషయాలను విద్యార్థులతో సరదాగా పంచుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu) తనకు అసలు టైమ్ ఇవ్వరని తాను కూడా ఆయనను డిస్టర్బ్ చేయననని చెప్పుకొచ్చారు. ప్రతి భార్య కూడా తన భర్తకు అండగా నిలబడాలని సూచించారు.

- Advertisement -

అలాగే హీరో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాలు చాలా తక్కువగా చూస్తానని… అయితే తనకు నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, అఖండ సినిమాలు అంటే చాలా ఇష్టమన్నారు. ఇక అందరూ బాలకృష్ణను తన తమ్ముడు అనుకుంటారని, కానీ వాస్తవానికి ఆయన తన అన్న అని భువనేశ్వరి వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News