ఫార్ములా-ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అరెస్ట్‌కు రంగం సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇవాళ ఏ క్షణమైనా కేటీఆర్‌ను అరెస్టు చేసే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణ భవన్‌కు(Telangana Bhavan) భారీగా పోలీసులు చేరుకోవడంతో ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. దీంతో బీఆర్‌ఎస్ శ్రేణులు కూడా అక్కడికి భారీగా చేరుకుంటున్నారు.
- Advertisement -
ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ పరిసరాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ కేసులో FIR నమోదు కావడంతో హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.