Friday, December 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Ayyanna Patrudu: పింఛన్లపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు

Ayyanna Patrudu: పింఛన్లపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు

ఏపీలో పింఛన్లపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు(Ayyanna Patrudu) వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 3.20 లక్షల మంది దొంగ పింఛన్లు తీసుకుంటున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తప్పుడు వయసుతో పెన్షన్లు తీసుకోవడం ఏంటి? ఇది దొంగతనం కాదా? అని మండిపడ్డారు. దొంగ పెన్షన్ తీసుకుంటున్న వారందరూ… దొంగలే అన్నారు. వీరికి నెలకు రూ.120 కోట్లు, ఏడాదికి రూ.1440 కోట్లు, ఐదేళ్లకు రూ.7200 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ఈ రూ.7వేల కోట్లు మిగిలితే తాండవ రిజర్వాయర్ లాంటివి మూడు కట్టొచ్చని తెలిపారు.

- Advertisement -

దొంగ పెన్షన్లపై సీఎం చంద్రబాబుకు(Chandrababu) కూడా ఫిర్యాదు చేశానని.. విచారణ చేద్దామని తెలిపారని అయ్యన్న వెల్లడించారు. దీంతో అయ్యన్న వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కాగా పింఛన్లపై సీఎం చంద్రబాబు కూడా ఇటీవల ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అనర్హులు పింఛన్లు తీసుకుంటున్నారని.. వీరికి పింఛన్ కట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇలాంటి వారిని గుర్తించి నోటీసులు కూడా ఇస్తామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News