తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసాభాసగా మారాయి. ఫార్ములా ఈ-కారు రేసు అంశంపై సభలో చర్చ పెట్టాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టగా.. స్పీకర్ తిరస్కరించడంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైకి కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ చెప్పు చూపించడం కలకలం రేపింది. అసెంబ్లీలో ఎమ్మెల్యే శంకర్ తీరుపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. తమకు చెప్పు చూపించారంటూ ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఫుటేజ్ బయటపెట్టాలని.. తమకు చెప్పు చూపించిన శంకర్‌పై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
TG Assembly: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చెప్పు చూపించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
సంబంధిత వార్తలు | RELATED ARTICLES