హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) చోటు చేసుకుంది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీ సత్వ రెస్టారెంట్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఐదో ఆంతస్తులో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. సిలిండర్లు పేలడంతో భవనం పాక్షికంగా దెబ్బతింది.
- Advertisement -
ఈ ప్రమాదంలో పక్క బిల్డింగ్‌లో ఉన్న ఐటీ ఉద్యోగులకు గాయాలయ్యాయి. దీంతో సమీపంలో ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీల ఉద్యోగులను అధికారులు అక్కడి నుంచి పంపించివేశారు. రెండు అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటల ధాటికి చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.