హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలు, చెరువులు, కుంటలు, నాలాల కబ్జా నుంచి కాపాడేందుకు ప్రభుత్వం హైడ్రాను(Hydra) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే బడాబాబుల నిర్మాణాలను వదిలేసి ఎఫ్ఠీఎల్(FTL), బఫర్ జోన్లు పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారంటూ హైడ్రాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా హైడ్రా సైలెంట్ అయిపోయింది. దీంతో కూల్చివేతలపై హైడ్రా యూటర్న్ తీసుకుందనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.
తాజాగా ఈ ప్రచారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్(Ranganath) సంచలన వ్యాఖ్యలు చేశారు. కూల్చివేతల విషయంలో హైడ్రా ఎలాంటి యూటర్న్, బ్యాక్ టర్న్ తీసుకోలేదన్నారు. ప్రభుత్వ పాలసీ ప్రకారం తమ కార్యచరణ ఉంటుందని తెలిపారు. 2024 జులైకి ముందు పర్మిషన్లు ఉన్న ఇళ్లను కూల్చబోమని స్పష్టం చేశారు. గత అనుభవాల దృష్ట్యా తమ పాలసీలో కొన్ని మార్పులు తీసుకొస్తున్నామని ఆయన వెల్లడించారు.