Sunday, December 22, 2024
Homeఆంధ్రప్రదేశ్YS Sharmila: మహిళల భద్రతకు మీకు మనసు రావడం లేదా..?: షర్మిల

YS Sharmila: మహిళల భద్రతకు మీకు మనసు రావడం లేదా..?: షర్మిల

మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) విమర్శించారు. ఈమేరకు ఎక్స్ వేదిగా ఆమె పోస్ట్ చేశారు.

- Advertisement -

‘మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కాలయాపన తప్పా ఇచ్చిన హామీ నిలబెట్టుకునే బాధ్యత కనిపించడం లేదు. అధికారం చేపట్టిన 6 నెలల్లో పండుగలు, పబ్బాలు పేరు చెప్పి దాటవేశారు. బస్సులు కొంటున్నాం అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మంత్రివర్గ ఉప సంఘం పేరుతో మరికొన్ని రోజులు సాగతీతకు సిద్ధమయ్యారు.

చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఉచిత ప్రయాణం కల్పించడంలో ఇన్ని బాలారిష్టాలు ఎందుకు ? చిన్న పథకం అమలుకు కొండత కసరత్తు దేనికోసం ? తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే పథకం అమలు చేసి చూపించారు కదా ? ఉన్న బస్సుల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు కదా ? పథకం అమలును బట్టి అదనపు ఏర్పాట్లు చేసుకున్నారు కదా ?

జీరో టిక్కెట్ల కింద నెలకు రూ.300 కోట్లు ఆర్టీసీకి ఇవ్వడానికి మీ ప్రభుత్వం దగ్గర నిధులు లేవా ? మహిళల భద్రతకు మీకు మనసు రావడం లేదా ? ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ యాజమాన్యం చెప్తుంటే మీకొచ్చిన ఇబ్బంది ఏంటి ? కనీసం నూతన సంవత్సర కానుక కిందైనా మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మీ చిత్తశుద్ది ఏంటో నిరూపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.’అని షర్మిల పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News