హైదరాబాద్ లో శ్రీవైభవం షాపింగ్ మాల్ ఘనంగా సాగింది. కొత్తపేటలో శ్రీ వైభవం షాపింగ్ మాల్ ను చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. హీరోయిన్ శ్రీలీల ఈ ప్రారంభోత్సవంలో పాల్గొని సందడి చేస్తూ, ఎదురుచూస్తున్న అభిమానులకు రాబోయే కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -
ఈ కార్యక్రమంలో ఆర్డిసీ చైర్మన్ మల్ రెడ్డి రంగారెడ్డి, స్థానిక కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, సుధీర్ రెడ్డి, జైపాల్ రెడ్డి శ్రీ వైభవం షాపింగ్ మాల్ యండి వలస చలపతి, ఆప్తాబ్ అహ్మద్ ఇతర స్థానిక నాయకులు, షాపింగ్ మాల్ యాజమాన్య కుటుంబసభ్యులు పాల్గొన్నారు.