వైసీపీ(YCP) కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నానికి(Perni Nani) ఉచ్చు బిగుస్తోంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం దూసుకుడుగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా పేర్ని నానికి చెందిన గోడౌన్‌లో మిస్ అయిన రేషన్ బియ్యం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా నానితో పాటు ఆయన కుమారుడు పేర్ని కిట్టుకి నోటీసులు జారీ చేశారు. నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు నాని ఇంటికి వెళ్లగా.. ఇంట్లో ఎవరూ లేరు. దీంతో నోటీసులను ఇంటి గేటుకు అంటించారు. ఇవాళ(ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల లోపు విచారణకు రావాలని ఆదేశించారు.
కాగా ఈ కేసులో పేర్ని నాని భార్య జయసుధ, ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజ కూడా నిందితులుగా ఉన్నారు. మానస తేజ పరారీలో ఉండగా గాలింపు చర్యలను పోలీసులు వేగవంతం చేశారు. మరోవైపు నాని భార్య కోర్టును ఆశ్రయించారు. తాజాగా నాని, ఆయన కుమారుడికి నోటీసులు జారీ చేయడంతో వీరిని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.