తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డిని(CM Revanth Reddy) నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్(Arvind Dharmapuri) కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఎంపీ అరవింద్‌తో పాటు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్(Sanjay Kumar) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భగా రేవంత్ రెడ్డికి శాలువా కప్పి సత్కరించారు. అనంతరం తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్ర అభివృద్ధిపై చర్చించినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి కూడా ఉన్నారు.
కాగా ఇటీవల కేంద్ర కేబినెట్ జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలో నవోదయల ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో నవోదయల ఏర్పాటుకు ఒక్కోచోట సుమారు 20 ఎకరాల భూమిని ప్రభుత్వం అందజేయాలని రేవంత్ రెడ్డిని కోరారు. ఈ సందర్భంగా రెండు జిల్లాల్లో పలు ప్రతిపాదిత స్థలాలను ఎంపీ, సీఎంకు వివరించారు.