విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని తెలంగాణ మంత్రి సీతక్క(seethakka) దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం అమ్మవారి ఆలయానికి విచ్చేసిన సీతక్క దుర్గగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతక్కకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సీతక్కను వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు అమ్మవారి శేష వస్త్రం, ప్రసాదం చిత్రపటం అందజేశారు.