Sunday, December 22, 2024
Homeచిత్ర ప్రభAllu Arjun: తోలు తీస్తాం.. అల్లు అర్జున్‌కు ACP స్ట్రాంగ్ వార్నింగ్

Allu Arjun: తోలు తీస్తాం.. అల్లు అర్జున్‌కు ACP స్ట్రాంగ్ వార్నింగ్

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది. పరిస్థితి చూస్తుంటే అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వంగా పరిస్థితి మారిపోతుంది. అసెంబ్లీలో అల్లు అర్జున్(Allu Arjun) వ్యవహారశైలిపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. వెంటనే బన్నీ కూడా ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ వ్యాఖ్యలను పరోక్షంగా కొట్టిపారేశారు. ఈ వ్యవహారంలోకి తాజాగా పోలీసు ఉన్నతాధికారులు ఎంటర్ అయ్యారు. ఇప్పటికే అల్లు అర్జున్ వ్యవహారశైలిపై డీజీపీ జితేందర్ స్పందించగా.. తాజాగా ఏసీపీ విష్ణుమూర్తి(ACP Vishnumurthy) బన్నీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ రిమాండ్ ఖైదీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

“ఓ సినిమా యాక్టర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ఘటన ఒక యాక్సిడెంట్ అని, అందుకు ఎవరూ కారకులు కారని చెప్పారు. ఆయనపై ఎవరికీ పగ లేదు. కానీ ఆయన చేసే పనులు రాజ్యాంగానికి, చట్టానికి లోబడి ఉన్నాయా, లేదా అనేది చూసుకోవాలి. ఆయనేమీ పాలుతాగే పిల్లవాడు కాదు… 40 ఏళ్లు పైబడిన వ్యక్తి. ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలి, ఎంత హుందాగా వ్యవహరించాలి? ఒక సెలెబ్రిటీగా ఉన్న వ్యక్తి చట్టాల గురించి, తన పరిధి గురించి తెలుసుకోవాలి? అసలు… ముద్దాయిగా ఉన్న వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టొచ్చా? ఆ అధికారం ఉందా? ఆయన రిమాండ్ ఖైదీ… బెయిల్ పై బయట ఉన్నారు. తాను, దర్శకుడు సుకుమార్, మరొకరు కలిసి కొంత మొత్తం బాధిత కుటుంబానికి ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పారు. ఈ చర్య పరోక్షంగా బాధితులను ప్రలోభానికి గురిచేసినట్టే అవుతుంది.

ఆయన కళ్లలో నాకు ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదు. ఈ పదిహేను రోజుల నుంచి సక్సెస్ మీట్‌లు పెట్టుకోలేకపోతున్నాననే బాధే కనిపించింది తప్ప ఆయనలో ఎలాంటి విచారం లేదు. ఆయన తన ఇంటిని ఒక ఫంక్షన్ హాల్ లాగా మార్చేసి, వచ్చేవాళ్లు, పోయేవాళ్లతో ఆయన చాలా హ్యాపీగా గడిపేస్తున్నాడు. చట్టం ఎప్పుడూ బాధితుల పక్షానే ఉంటుంది… మరి నువ్వు బాధితుడివా? ఏ రకంగా బాధితుడివి? బాగా పైసలు సంపాదించుకుని, లెక్కలు చూసుకుంటున్నావు… నీపై ఎవరైనా వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రెస్ మీట్లు పెడుతున్నావు.

నీ కళ్ళ ముందు ఇద్దరు కింద పడితే అందులో ఒక్కరూ చనిపోతే అగి చూడలేవా..? నీకు ఎలాంటి బాధ్యత లేదు కాబట్టి ఇలా వెళ్లవ్. నీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు, వెళ్లారు. ఒక్క పోలీసు అధికారి కూడా నీ దగ్గరకి రాకుండా చేస్తాం. ఎలా బయటకి వెళ్తావ్ ఆలోచించుకో. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎవరు ఊరుకోరు. పోలీసు అధికారుల ఓపిక నశిస్తే ఎక్కడ ఏం కట్ చేయాలో అన్ని మాకు తెలుసు. ఎవ్వడైనా సరే తోలు తిస్తాం జాగ్రత్త” అంటూ అల్లు అర్జున్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News