Saturday, October 5, 2024
Homeనేరాలు-ఘోరాలుHyd: నగర పోలీసుల అత్యున్నత సమీక్షా సమావేశం

Hyd: నగర పోలీసుల అత్యున్నత సమీక్షా సమావేశం

హైదరాబాద్ నగర పోలీసుల అత్యున్నత సమీక్షా సమావేశం సీపీ సి.వి.ఆనంద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి అడిషనల్ డీసీపీ, ఇతర ఉన్నత ర్యాంకుల అధికారులు హాజరయ్యారు. ప్రజా భద్రత, పాలనాపరమైన అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా సీపీ ఆనంద్ మాట్లాడుతూ పెండింగ్ కేసులు, వాటి విచారణ, చార్జీ షీటుల పరిస్థితిని తెలుసుకున్నారు. వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీసీపీలకు సూచించారు. అదే విధంగా డ్రోన్స్, సీసీటీవీ కెమెరాల నిర్వహణ, మరమ్మత్తుల కోసం డి-సిఎఎంఓ (డ్రోన్స్ అండ్ కెమెరాస్ మెయింటెనన్స్ ఆర్గనైజేషన్) పరిచయం చేశామన్నారు. వేరే సంస్థ ద్వారా సీసీటీవీలు ఎక్కడెక్కడ పనిచేయడం లేదు, ఎక్కడ అవసరం అనే వాటిపై సర్వే చేయిస్తామన్నారు.

- Advertisement -

నేరాల నియంత్రణలో సీసీటీవీల పాత్రను ప్రజలకు వివరించాలని సూచించారు. ఆన్ లైన్ వ్యవస్థల పనితీరు ఆశాజనకంగా ఉండడంతో ఆయుధాల లైసెన్స్ లను కూడా ప్రజా సౌకర్యార్థం ఆన్ లైన్ చేయాలని ఐటీ విభాగాన్ని ఆదేశించినట్లు వెల్లడించారు. హోళి, షబ్ ఏ భారత్, రంజాన్, శ్రీరామ నవమి, హనుమాన్ జయంతిల నేపథ్యంలో కమ్యూనల్, రౌడీ షీటర్లను బైండోవర్ చేయాలని, పీస్ కమిటీల్లో ఎక్కువ మంది యువత ఉండేలా చూడాలని తెలిపారు. ఫిట్ కాప్ కార్యక్రమ నిర్వహణ కోసం మరిన్ని ప్రణాళికలు రూపొందించాలని డీసీపీలకు తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News