ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు(PV Sindhu) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన స్నేహితుడు, పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో ఆమె వివాహం ఆదివారం రాత్రి 11.20 గంటలకు ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, ప్రత్యేక అతిథుల సమక్షంలో సాయి-సింధు ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్ సాగర్ సరస్సులో ఉన్న రఫల్స్ హోటల్లో ఈ వేడుక జరిగింది.
ఉదయ్‌పూర్‌లోని ఉదయసాగర్ ఓ దీవి. ఆరావళి పర్వతాల మధ్యలో ఉన్న ఈ దీవి మొత్తం 21 ఎకరాల్లో ఉంటుంది. రఫల్ సంస్థ ఈ దీవిని అద్భుతంగా తీర్చిదిద్దింది. దీవి మధ్యలో ఉండే భారీ రిసార్ట్‌లో గెస్టుల కోసం 100 గదులను ఏర్పాటు చేసింది. ఈ దీవికి వెళ్లడానికి పడవల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. రిసార్టులో ఒక గదికి రోజుకు రూ.లక్ష అద్దె ఛార్జ్ చేస్తారు.
కాగా సింధు తన పెళ్లికి ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ లాంటి ప్రముఖులను సింధు ఆహ్వానించారు. మంగళవారం హైదరాబాద్‌లో జరగనున్న రిసెప్షన్‌కు తెలుగు రాష్ట్రాల సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరుకానున్నారు.