Monday, December 23, 2024
HomeతెలంగాణVijayashanti: సంధ్య థియేటర్ ఘటన.. బీజేపీ నేతలపై విజయశాంతి ఫైర్

Vijayashanti: సంధ్య థియేటర్ ఘటన.. బీజేపీ నేతలపై విజయశాంతి ఫైర్

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై సినీ నటి, కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి(Vijayashanti) స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి‌((CM Revanth Reddy)పై కేంద్ర మంత్రులు ఆరోపణలు చేయడం గర్హనీయమని విమర్శించారు. ఈ ఘటనను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఈమేరకు ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు.

- Advertisement -

“ఒక సినిమా విడుదల సందర్భంగా జరిగిన దురదృష్టకర ఘటన. తెలంగాణలో ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య విభజన రేఖలు తెచ్చే వరకు వెళుతున్నట్లుగా కనిపిస్తోంది. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు, ప్రెస్‌ మీట్లు, తదనంతర భావోద్వేగాలు అలాగే అనిపిస్తున్నాయి.

ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసుందామనే నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అయితే మళ్లీ ప్రజల మనోభావాల మధ్య విభజనలు వచ్చే వరకు నడవాలనేది కొన్ని రాజకీయ పార్టీల ప్రయోగంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా ఈ ఘటనను తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నట్టుగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల బీజేపీ నేతల ప్రకటనలు కనిపిస్తున్నాయి.

సినిమా పరిశ్రమను నాశనం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ కేంద్ర మంత్రులు ఆరోపణలు చెయ్యడం గర్హనీయం. సినిమా పరిశ్రమకు అన్ని ప్రాంతాల ప్రజల ఆదరణ కావాల్సి ఉంటుంది. ఇదంతా ఎంతవరకు అవసరమన్న పరిశీలన చేసుకొని పరిష్కరించుకునే ప్రయత్నం జరగాలి” అని ఆమె సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News