సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని(Revanth Reddy) టాలీవుడ్ ప్రముఖులు కలవనున్నారు. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీ ప్రచారంలో భాగంగా అమెరికాలో ఉన్న నిర్మాత, ఎఫ్‌డీసీDC)( ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) హైదరాబాద్‌కు తిరిగి వచ్చాక సీఎంను కలుస్తామని చెప్పారు. టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలపై చర్చిస్తామని తెలిపారు.
ఇకపై తొక్కిసలాట ఘటలను జరగకుండా తమ పరిధిలో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చారు. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్‌కు షిఫ్ట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది కదా? అని విలేకరులు ప్రశ్నింగా..చాలా డబ్బులు పెట్టి హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకున్నానని.. మరో ప్రాంతానికి ఎందుకు వెళ్తానని స్పష్టంచేశారు. ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం నుంచి ఎప్పుడూ సపోర్ట్ ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి చెబుతూనే ఉన్నారని గుర్తుచేశారు. అప్పటినుంచి రిలీజ్ అయిన సినిమాలకు సపోర్ట్ ఇస్తూనే ఉన్నారని నాగవంశీ వెల్లడించారు.
కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కారణంగా ఇకపై టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. తాను సీఎంగా ఉన్నంతకాలం తెలంగాణలో స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. దీంతో సంక్రాంతికి విడుదల కానున్న ‘గేమ్ ఛేంజర్’, ‘డాకు మహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’పై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ప్రముఖులు సీఎంని కలిసే యోచనలో ఉన్నారు.