Monday, December 23, 2024
HomeతెలంగాణKTR: భారతరత్న పీవీ.. తెలంగాణ ఠీవి.. కేటీఆర్ నివాళులు

KTR: భారతరత్న పీవీ.. తెలంగాణ ఠీవి.. కేటీఆర్ నివాళులు

బహుభాషా కోవిదుడు, ఆర్థికవేత్త, భారతరత్న, మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు(P. V. Narasimha Rao)వర్ధంతి సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR) ఘనంగా నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణలతో దేశ ముఖచిత్రాన్ని మార్చిన పీవీ నతెలంగాణలో పుట్టడం మనందరికి గర్వకారణమన్నారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

- Advertisement -

“ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడారని, తన పాలనతో ఆధునిక భారతానికి బాటలు వేశారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత.. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహా రావు గారిని బీఆర్ఎస్ ప్రభుత్వం సముచితంగా గౌరవించింది. పీవీ నరసింహా రావు శత జయంతి ఉత్సవాలను కేసీఆర్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. నెక్లెస్ రోడ్‌కి పీవీ మార్గ్ అని పేరు పెట్టింది. ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.

వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టింది. అంతేగాక‌ పీవీ నరసింహా రావుకి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపించింది. అలాగే పీవీ కూతురిని ఎమ్మెల్సీగా గౌరవించింది. భారతరత్న పీవీ.. తెలంగాణ ఠీవి.. జోహార్ పీవీ! అని కేటీఆర్‌ వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News