Monday, December 23, 2024
Homeఆంధ్రప్రదేశ్YS Jagan: పులివెందులలో జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..

YS Jagan: పులివెందులలో జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌(YS Jagan) సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. డిసెంబర్ 24 నుంచి నాలుగు రోజుల పాటు పర్యటిస్తారు. ఈ మేరకు పార్టీ ప్రకటన విడుదల చేసింది.

- Advertisement -

మంగళవారం(డిసెంబర్ 24) ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి ఇడుపులపాయ చేరుకుని వైయస్ఆర్ ఘాట్‌ వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం ప్రేయర్‌ హాల్‌లో జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత కడప నియోజకవర్గ నాయకులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు పులివెందుల బయలుదేరతారు.

డిసెంబర్ 25న క్రిస్మస్‌ సందర్భంగా ఉదయం 8.30 గంటలకు సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తాతిరెడ్డిపల్లిలో రామాలయాన్ని ప్రారంభిస్తారు. ఈనెల 26న పులివెందుల క్యాంప్‌ ఆఫీస్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజాదర్భార్‌ నిర్వహిస్తారు. ఇక ఈనెల 27న ఉదయం 9 గంటలకు పులివెందుల విజయా గార్డెన్స్‌లో జరగనున్న వివాహానికి హాజరవుతారు. అనంతరం బెంగళూరు వెళ్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News