Monday, December 23, 2024
Homeటెక్ ప్లస్WhatsApp: జనవరి నుంచి ఈ ఫోన్లలో వాట్సప్‌ సేవలు బంద్‌

WhatsApp: జనవరి నుంచి ఈ ఫోన్లలో వాట్సప్‌ సేవలు బంద్‌

సైబర్ మోసాలను(Cyber ​​Frauds) అరికట్టేందుకు ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్(Whatsapp) కీలక నిర్ణయం తీసుకుంది. యూజర్లకు సెక్యూరిటీ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో జనవరి 1 నుంచి పాత ఫోన్లలో తమ సేవలను నిలిపివేస్తున్నామని ప్రకటించింది. దాదాపు 9-10 ఏళ్ల క్రితం తీసుకొచ్చిన ఆండ్రాయిడ్‌ కిట్‌క్యాట్‌(Android KitKat) ఓఎస్‌తో పనిచేస్తున్న ఫోన్లలో తమ సేవలను ఆపివేస్తున్నామని పేర్కొంది. అలాగే ఐఓఎస్‌(IOS) 15.1, అంతకంటే పాత వెర్షన్లు వాడుతున్న ఐఫోన్లకూ తన సపోర్ట్‌ నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

- Advertisement -

వాట్సప్‌ సేవలు నిలిచిపోనున్న ఫోన్లు ఇవే..

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌3, మోటో జీ, HTC వన్‌ఎక్స్‌, HTCవన్‌ ఎక్స్‌+, HTC డిజైర్‌ 500, HTC డిజైర్‌ 601, శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌2, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌4 మినీ, మోటో రేజర్‌ హెచ్‌డీ, మోటో ఈ 2014, LG ఆప్టిమస్‌ జీ, LG నెక్సస్‌ 4, LG జీ2 మినీ, LG ఎల్‌ 90, సోనీ ఎక్స్‌పీరియా జడ్‌, సోనీ ఎక్స్‌పీరియా ఎస్పీ, సోనీ ఎక్స్‌పీరియా టీ, సోనీ ఎక్స్‌పీరియా వి తదితర ఫోన్లు ఉన్నాయి. దీంతో ఈ ఫోన్లు ఇప్పటికీ వాడుతున్న వారు వాట్సప్ సేవలు కావాలనుకుంటే జనవరి 1 నుంచి కొత్త ఫోన్లు వాడక తప్పదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News