ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు ఉండవని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు(Vishnu Kumar Raju) స్పందించారు. అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజమైతే తాను తప్పకుండా ఏకీభవిస్తా అన్నారు. ఓ మహిళ చనిపోయిన విషయం ముందే తెలిసినా అల్లు అర్జున్(Allu Arjun) వెంటనే స్పందించకపోవడం విచారకరమన్నారు. బెనిఫిట్ షోలు రద్దు చేయాలని.. ఒకవేళ అనుమతి ఇచ్చినా నియంత్రణ ఉండాలని అభిప్రాయపడ్డారు.
ఇక రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు పురందేశ్వరి(Purandeswari), కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమని తెలిపారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయితే చాలామంది నటులు ఆయనను పరామర్శించారని.. కానీ చనిపోయిన మహిళ కుటుంబాన్ని ఎవరూ పరామర్శించలేదని అసహనం వ్యక్తం చేశారు. బెన్‌ఫిట్ షోలను తప్పకుండా ఆపివేయడం మంచిదన్నారు.