సినీ నటుడు మోహన్ బాబుకు(Mohan Babu) మరో భారీ షాక్ తగిలింది. జర్నలిస్టులపై దాడి కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు(TG Highcourt) కొట్టివేసింది. మోహన్‌బాబు అనారోగ్యంతో ఉన్నారని, గుండె, నరాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని ఆయన తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ఇటీవల దుబాయ్‌లో ఉన్న తన మనవడిని కలిసేందుకు వెళ్లారని అనంతరం తిరుపతికి తిరిగొచ్చి విద్యా సంస్థల బాధ్యతలు చూస్తున్నట్లు తెలిపారు.
అయితే ముందస్తు బెయిల్ ఇవ్వొద్దంటూ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం మోహన్ బాబు ముందుస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటికే విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన పోలీసులు.. ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.