“మొదటి ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్ ఎలా క్రాక్ చేయాలి” పై సెమినార్ మాస్టర్ క్లాస్ ఆసక్తిగా సాగింది. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్ (IIMC) లో “మొదటి ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్ ఎలా క్రాక్ చేయాలి: UPSC మాస్టర్ క్లాస్” అనే సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వింగ్స్ మీడియా, జీ5 మీడియా గ్రూప్, 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ సంయుక్తంగా ఏర్పాటు చేశాయి.
21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఛైర్మన్ పీ. కృష్ణ ప్రదీప్ విద్యార్థులతో మాట్లాడుతూ, సివిల్ సర్వీసెస్‌లో ఎంపిక కావడం ద్వారా సమాజ సేవకు న్యాయబద్ధమైన అధికారం లభిస్తుందని చెప్పారు. తన ప్రసంగంలో ఆయన 2017 సివిల్ సర్వీసెస్ టాపర్, ప్రస్తుత హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిష్కరించిన ఒక ఉదాహరణను ప్రస్తావించారు. ఒక వృద్ధ దంపతులు తమ పిల్లల వల్ల ఇల్లు కోల్పోయినప్పుడు, 2007 చట్టం కింద కలెక్టర్ దురిశెట్టి చొరవ చూపి, వారికి తిరిగి న్యాయం అందించడంతోపాటు, వారి ఆస్తిని తిరిగి పొందేలా చేశారు. ఈ ఉదాహరణ సివిల్ సర్వీసెస్‌లో ఉన్న అధికారంకు నిదర్శనమని ఆయన తెలిపారు. డా. భవాని శంకర్, అకాడమీ చీఫ్ మెంటార్ మాట్లాడుతూ పరీక్ష పాసయ్యే దానికి క్రమశిక్షణ చాలా అవసరమని , దానిపై విద్యార్థులు దృష్టి సారించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో 21st సెంచరీ అకాడమీ నిపుణులు రూపొందించిన ప్రత్యేక పుస్తకాలను లాంచ్ చేశారు.
ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ కె. రఘువీర్ అధ్యక్షత వహించి విద్యార్థులకు విలువైన సలహాలు అందించారు. వైస్ ప్రిన్సిపాళ్లు డా. డి. తిరుమల రావు, డా. జి. సంతోషి, అలాగే G5 మీడియా డైరెక్టర్లు గిరి ప్రకాష్, గణేష్ పాల్గొన్నారు.