Tuesday, December 24, 2024
Homeచిత్ర ప్రభGame Changer: రామ్ చరణ్ కోసం రంగంలోకి ఎన్టీఆర్.. ఫొటో వైరల్

Game Changer: రామ్ చరణ్ కోసం రంగంలోకి ఎన్టీఆర్.. ఫొటో వైరల్

Game Changer| గ్లోబ‌ల్ స్టార్‌ రామ్ చరణ్(Ram Charan), దిగ్గజ ద‌ర్శ‌కుడు శంక‌ర్(Shankar) కాంబినేష‌న్‌లో వ‌స్తున్న కొత్త చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుద‌లైన‌ పాటలు, టీజర్ మూవీపై భారీగా అంచనాలు పెంచేశాయి. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఎస్ఎస్ థ‌మ‌న్ బాణీలు అందించిన ఈ మూవీలో అంజలి, సునీల్, సముద్రఖని, ఎస్‌జే సూర్య, నవీన్ చంద్ర త‌దిత‌రులు కీలక పాత్రల్లో న‌టించారు. కాగా ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా 2025 జనవరి 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

మూవీ విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను గట్టిగా ప్లాన్ చేస్తోంది. తాజాగా అమెరికాలోని డల్లాస్‌లో ఓ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకకు అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది. దీంతో మేకర్స్‌ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇదే ఊపులో ప్రమోషన్స్‌ను మరింత గట్టిగా చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే విన్నూత ప్రచారానికి మూవీ టీమ్ శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ప్రేక్షకుల అటెన్షన్ గ్రాబ్ చేసేందుకు రామ్ చరణ్, ఎన్టీఆర్(NTR)లతో కలిసి ఓ ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. తాజాగా థమన్‌తో చెర్రీ, తారక్ అమెరికాలో దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News