తిరుమల(Tirumala) శ్రీవారి భక్తులకు టీటీడీ(TTD) త్వరలోనే శుభవార్త అందించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(AI) సేవలను వాడుకునేందుకు టీటీడీ బోర్దు సిద్ధమైంది. కేవలం రెండు గంటల్లోనే స్వామివారి దర్శనం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ఫేస్ రికగ్నిషన్ ఎంట్రీపై పాలకమండలి సభ్యులకు బెంగళూరుకు చెందిన సీట్రూ అండ్ ఏషియా అనే కంపెనీ టీటీడీ చైర్మన్ కార్యాలయంలో డెమో ఇవ్వడం జరిగింది.
తొలుత కియోస్కూలో ఫేస్‌తో టోకెన్ జారీ, ఫేషియల్ రికగ్నేషన్, బారియర్ గేట్ వద్ద నిలబడితే గేటు తెర్చుకోవడం తదితర అంశాలపై వివరణ ఇచ్చింది. ఈ కార్యక్రమానికి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు కొంతమంది సభ్యులు హాజరయ్యారు. ఏఐ టెక్నాలజీ ద్వారా రెండు గంటలలో స్వామివారి దర్శనం చేసుకోవడంపై గత బోర్డు సమావేశంలో తీర్మానం చేసింది.