సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్‌కు(Allu Arjun) చిక్కడపల్లి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బన్ని కాసేపటి క్రితమే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ప్రస్తుతం బన్నీని పోలీసులు విచారిస్తున్నారు. రెండు గంటల పాటు ఈ విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు అధికారి ఏసీపీ రమేష్ కుమార్‌తో పాటు సెంట్రల్ జోన్ డీసీపీలు బన్నీ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తున్నారు. వీలైతే అల్లు అర్జున్‌ను సీన్ రీకన్‌స్ట్రేషన్ కోసం సంధ్య థియేటర్‌కు తీసుకువెళ్లనున్నారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 18 ప్రశ్నలు అడగనున్నట్లు సమాచారం.
పోలీసుల ప్రశ్నలు ఇవే..!
సంధ్య థియేటర్‌కు వస్తున్నట్లు ఎవరికి సమాధానం ఇచ్చారు..?
థియేటర్‌కు రావద్దని మీకు ముందే యాజమాన్యం చెప్పిందా?
పోలీసులు అనుమతి లేదన్న విషయం తెలుసా? తెలియదా?
సంధ్య థియేటర్‌లో ప్రిమియర్ షోకు వస్తున్నట్లు అనుమతి కోరారా? ఆ కాపీ ఏమైనా ఉందా?
మీరు గానీ, మీ పీఆర్ టీమ్‌గానీ పోలీసుల అనుమతి తీసుకున్నారా?
సంధ్య థియేటర్ వద్ద ఎందుకు ఊరేగింపుగా వెళ్లాల్సి వచ్చింది?
సంధ్య థియేటర్ దగ్గర ఉన్న పరిస్థితిని మీ పీఆర్ టీమ్ ముందే మీకు వివరించిందా?
తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది?
తొక్కిసలాట జరిగిన విషయాన్ని మీకు ముందుగా ఎవరు చెప్పారు?
ఏసీపీ చెప్పనప్పుడు థియేటర్ నుంచి ఎందుకు వెళ్లలేదు?
సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు మళ్లీ ఎందుకు ప్రేక్షకులకు అభివాదం చేశారు..?
రేవతి చనిపోయిన విషయం మరుసటిరోజు వరకు మీకు తెలియలేదా?
సినిమా ప్రారంభమయ్యాక కొద్దిసేపటికే తొక్కిసలాట విషయం తెలిసినా మీరెందుకు సినిమా చూశారు?
రోడ్ షో కోసం మీరు ఎంతమంది బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు?