వచ్చే ఏడాది మలేషియాలో జరగనున్న మహిళల అండర్-19 టీ20(Under-19 Women’s T20 WC) ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు నిక్కీ ప్రసాద్ కెప్టెన్, సానికా చల్కే వైస్ కెప్టెన్‌గా వ్యవహరించారు. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు అమ్మాయిలకు జట్టులో చోటు దక్కడం విశేషం.
జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఈ పొట్టి కప్ జరగనుంది. మొత్తం 41 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. 16 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ దశలో భారత్ జనవరి 19న వెస్టిండీస్, 21న మలేసియా, జనవరి 23న శ్రీలంకతో తలపడనుంది. అండర్-19 స్థాయిలో ఇది రెండో టీ20 ప్రపంచకప్. 2023లో నిర్వహించిన తొలి టోర్నీలో భారత్ విశ్వవిజేతగా నిలిచింది.
భారత జట్టు.. నిక్కీ ప్రసాద్ (కెప్టెన్), సానికా చల్కే (వైస్ కెప్టెన్), గొంగడి త్రిష, కమిలిని జి(వికెట్ కీపర్), భవికా అహిరె (వికెట్ కీపర్), ఈశ్వరి అవసరె, మిథిలా వినోద్, జోషితా వీజే, సోనమ్ యాదవ్, పర్ణికా సిసోదియా, కేసరి ధృతి, ఆయుషి శుక్లా, ఆనందితా కిశోర్, షబ్నమ్, వైష్ణవి ఎస్.
స్టాండ్‌బై ప్లేయర్లు: నందన ఎస్, ఐరా జే, అనధి టి