కేంద్ర ఎన్నికల సంఘం(CEC)పై కాంగ్రెస్(Congress) పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇటీవల ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ చర్యల వల్ల ఎన్నికల ప్రక్రియ సమగ్రతకు భంగం కలుగుతుందని పేర్కొంది. ఈమేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ సుప్రీంకోర్టు(Supreme Court)లో తాజాగా రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేందుకు అనుమతించే నిబంధనల్లో CEC మార్పులు చేసింది. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన సీసీ టీవీ పుటేజ్, వెబ్ కాస్టింగ్ రికార్డులను, అభ్యర్థులకు చెందిన వీడియో రికార్డులను తనిఖీ చేయకుండా నిషేదం విధించింది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961లోని రూల్ 93(2) (ఏ) ను కేంద్ర న్యాయశాఖ సవరించింది. దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానాన్ని పిటిషన్ దాఖలు చేసింది.