Saturday, November 23, 2024
Homeహెల్త్Beauty tips: అందానికి వంటింటి చిట్కాలు

Beauty tips: అందానికి వంటింటి చిట్కాలు

మన సౌందర్యాన్ని పెంచే సాధనాలు మన వంటిట్లేనే ఉన్నాయి. అవేమిటంటే…

- Advertisement -

 సిట్రిక్ యాసిడ్ గుణాలు ఉన్న చింతపండు వంటల్లో మాత్రమే రాణి కాదు మీ సౌందర్యాన్ని పెంచే మంచి సాధనం కూడా . చింతపండు రసాన్ని ముఖానికి రాసుకుని కాసేపైన తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కుంటే చర్మం ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది. అలాగే చింతపండు, పాలు రెండింటినీ కలిపి మిక్సీలో వేసి గుజ్జులా గ్రైండ్ చేసి దాన్ని ముఖానికి రాసుకుని కాసేపైన తర్వాత నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చర్మంపై ఉన్న నల్లని మచ్చలతో పాటు ముడతలు, గీతలు కూడా పోతాయి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

 ఆలివ్ లేదా బాదం నూనెను ముఖానికి పూసుకుని పదినిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత నీళ్లతో ముఖాన్ని కడిగేసుకుంటే ముఖం ఎంతో ప్రకాశవంతంగా తయారవుతుంది.

 వేసవి కాలంలో జుట్టుకు అవకెడో నూనె, కొబ్బరి నూనె, జొజొబా నూనె, బాదం, ఆలివ్ నూనె వీటిల్లో ఏది వాడినా వెంట్రుకలు ఎంతో ఆరోగ్యంగా, నిగ నిగలాడుతూ ఉంటాయి. అవకెడో నూనెలో ఎన్నో పోషకాలు ఉంటాయి. దీన్ని జుట్టుకు రాసుకుంటే చాలా తేలికగా అనిపిస్తుంది కూడా. ఇక కొబ్బరినూనె అయితే అన్ని రకాల శిరోజాల సంరక్షణకు ఎంతో మేలు చేస్తుంది. జొజొబా నూనె చిట్లిన వెంట్రుకలపై, అలాగే పొడిబారిన వెంట్రుకలపై ఎంతో బాగా పనిచేస్తుంది. బాదం నూనె జుట్టు ద్రుఢత్వాన్నికాపాడుతుంది. ఆలివ్ నూనె వెంట్రుకల సున్నితత్వాన్నే కాకుండా మాడును సైతం ఆరోగ్యంగా ఉంచుతుంది.

 ఇంట్లో తయారుచేసిన మందారపూల నూనెను తలకు పట్టించి అరగంట సేపు అలాగే ఉంచుకుని ఆ తర్వాత తలస్నానం చేస్తే తలలోని చుండ్రు సమస్య తగ్గుతుంది.

 అరటిపండు గుజ్జును కళ్ల చుట్టూ రాసుకుని పావుగంట తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కంటి చుట్టూ ఏర్పడ్డ నల్లటి వలయాలు పోతాయి.

 చెమటకాయలు పోవాలంటే వంటింటి చిట్కాలు చాలానే ఉన్నాయి. ఒక టిష్యు పేపరు తీసుకుని దాన్ని వెనిగర్ లో ముంచి చెమటకాయలు ఉన్నచోట దానితో అద్దొచ్చు. లేదా చెమటకాయల మీద బ్లాక్ టీని రాసుకున్నా కూడా అవి మానిపోతాయి. కాటన్ బాల్ ను తీసుకుని లవంగ నూనెలో ముంచి దానితో చెమటకాయలపై అద్దడం వల్ల అవి తగ్గుతాయి. మజ్జిగ, సబ్జా, లేదా బార్లీ నీళ్లు రోజూ తాగడం వల్ల కూడా చెమటకాయలు తగ్గుతాయి. గంధం, రోజ్ వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని చెమటకాయలమీద రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేస్తే కూడా చెమటకాయల బాధ నుంచి సాంత్వన పొందొచ్చు.

 మీ ముఖ చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా ఫేషియల్స్, క్లీనింగ్ చేసుకోవాలి. శెనగపిండి, పసుపు, తేనె, పెరుగు వంటి సింపుల్ వంటింటి చిట్కాలతో చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. కూరగాయలను, పండ్లను బాగా తినడం వల్ల శరీరం బాగా హైడ్రేట్ అయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

 టోనింగ్ కు రోజ్ వాటర్ ను ఉపయోగిస్తే చర్మానికి కావలసినంత తేమ అందుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News