మహా కుంభమేళా సందర్బంగా ప్రయాగ్రాజ్కు వచ్చే భక్తులు, యాత్రికుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐ.ఆర్.సి.టి.సి. టెంట్) స్వాగతం పలుకుతోంది. ఇక్కడకు వచ్చే యాత్రికుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
మహాకుంభ్ గ్రామ్ టెంట్సిటీ
వచ్చే యేడాది జనవరి–ఫిబ్రవరి నెలల్లో జరిగే మహాకుంభ మేళాకు మహాకుంభ్ గ్రామ్ టెంట్సిటీ యాత్రికులకోసం భారతీయ రైల్వే ఆధ్వర్యంలో ప్రొఫెషనల్ ప్రయాణం, పర్యాటకాన్ని, ఆతిథ్యాన్ని అందించేందుకు సిద్దమవుతోంది. కుంభ్ గ్రామ్ అనేది పర్యాటకుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన అత్యాధునిక వసతి సౌకర్యం. ఇది అన్ని ఆధునిక సౌకర్యాలతో కూడి ఉంది. టెంట్ సిటీ త్రివేణి ఘాట్‌కు దగ్గరలో ఉండటం వలన పుణ్య స్నానాలను చేసేందుకు అతిథులకు అనుకూలంగా ఉంటుంది. ఈ కుంభ్ గ్రామ్ నైనిలోని ఆరైల్ రోడ్, సెక్టార్-25 వద్ద త్రివేణి సంగమం నుండి కేవలం 3.5 కిలోమీటర్ల దూరంలో ఉండి స్నాన ఘాట్‌లు, ఇతర పర్యాటక ప్రదేశాలకు సులువైన వెళ్లేందుకు సదుపాయాలు కల్పిస్తుంది.
వివిధ బడ్జెట్లలో
ఇక్కడ ఆకర్షణీయమైన ధరలతో సూపర్ డీలక్స్ టెంట్లు, విల్లా టెంట్లు, శుభ్రమైన బాత్‌రూమ్‌లు, వేడి, చల్ల నీటి సౌకర్యాలు, రోజంతా అతిథులకు అందుబాటులో ఉండే సిబ్బంది, రూమ్ బ్లోవర్, బెడ్ లినెన్, టవల్స్ , టాయిలెట్‌లు మొదలైన సౌకర్యాలు , భోజనాల వసతితో సహా అన్ని రకాల ఏర్పాట్లు చేయనున్నారు. విల్లా టెంట్ల అతిథులకు ప్రత్యేకంగా హాయిగా కూర్చునే ప్రదేశం టివి వీక్షణ సౌకర్యం కూడా అందించనున్నారు. అతిథుల భద్రతకై సి.సి.టి.వీ.నిఘా ఏర్పాటు చేశారు. మహా కుంభ్ గ్రామ్‌లో ప్రథమ చికిత్స సౌకర్యాలు, రాత్రి, పగలు అత్యవసర సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు.
వెబ్‌సైట్ లో బుకింగ్‌లు
ఐ.ఆర్.సి.టి.సి www.irctctourism.com/mahakumbhgram వెబ్‌సైట్ లో కుంభ్ గ్రామ్ టెంట్ సిటీ కోసం బుకింగ్‌లను ప్రారంభించింది. ఐ.ఆర్.సి.టి.సి టికెటింగ్ వెబ్‌సైట్ www.irctc.co.in లో బ్యానర్‌ల ద్వారా అలాగే పుష్ నోటిఫికేషన్‌లు, మెయిల్‌ల ద్వారా మహాకుంభ్ గ్రామ్ – ఐ.ఆర్.సి.టి.సి టెంట్ సిటీని కూడా ప్రమోట్ చేస్తోంది. టూరిజం మంత్రిత్వ శాఖ , యుపి టూరిజం వెబ్‌సైట్లలో కూడా టెంట్ సిటీ లభ్యత పై సమాచారం అందిస్తుంది.
మేక్ మై ట్రిప్, గోఐబిబో వెబ్‌సైట్‌లలో మహాకుంభ్ గ్రామ్ బుకింగ్‌లు త్వరలో ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. విచారణలు, బుకింగ్‌ల కోసం ఐ.ఆర్.సి.టి.సి కస్టమర్ సపోర్ట్ టీమ్‌ని 8076025236లో సంప్రదించాలని లేదా [email protected] కి ఇమెయిల్ చేయాలని అధికారులు సూచించారు.