Friday, December 27, 2024
Homeచిత్ర ప్రభCM Revanth meeting film industry: సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ భేటీ

CM Revanth meeting film industry: సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ భేటీ

టాలీవుడ్..

సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం ప్రారంభమైంది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ లో ఈమేరకు టాలీవుడ్ ప్రముఖులు పలువురితో సీఎం భేటీ అయ్యారు. నాగార్జున, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, దిల్ రాజు, మురళీ మోహన్, శ్యాం ప్రసాద్ రెడ్డి, శివ బాలాజీ, బోయపాటి శ్రీను, రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, కిరణ్ అబ్బవరం, ఎలమంచిలి రవి, నాగార్జున, వెంకటేష్, సురేష్ వంటివారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

సినీ పెద్దల ప్రభుత్వ డిమాండ్ లు ప్రధాన అంశాలుగా ఈచర్చల్లో ఉన్నాయి. కులగణనలో సినీతరాలు పాల్గొని, ప్రచారం చెయ్యాలని, అసెంబ్లీలో ఇచ్చిన మాట ప్రకారం బెనిఫిట్ షోస్ వుండవని సర్కారు మరోమారు తెలిపినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ కు వ్యతిరేకంగా నిర్వహించే కార్యక్రమాలకు సిని నటులు పాల్గొనాలని, సినిమా టికెట్ల ధరలపై విధించే సెస్ స్కూల్స్ ఇంటిగ్రిటీ కోసం వాడుకోవాలని భేటీలో అజెండా అంశాలుగా చర్చకు వచ్చాయి. మరోవైపు సంధ్య థియేటర్ తొక్కిసలాటపై సిని పెద్దలకు వీడియో ద్వారా పోలీసులు చూపెట్టటం విశేషం.

ఫిలిం డెవల్ప్మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ భేటీ సాగుతుండగా, భేటీ తరువాత ప్రభుత్వం, టాలీవుడ్ చేసే ప్రకటనలపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. సంక్రాంతికి పెద్ద బ్యానర్ సినిమాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆడియో రిలీజ్, ప్రీ రిలీజ్, టికెట్ల రేట్లు, బెనిఫిట్ షోలు, సక్సెస్ మీట్ వంటి అంశాలపై రేవంత్ సర్కారు ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది పెద్ద హాట్ టాపిక్ గా మారింది. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందగా, ఆమె కుమారుడు ఇప్పటికీ చావుబతుకల మధ్య ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ పై రేవంత్ సర్కారు సీరియస్ అయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News