Friday, December 27, 2024
HomeదైవంTirumala Vaikunta Darashan tokens: తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనం టోకన్లు దొరికేది ఇక్కడే

Tirumala Vaikunta Darashan tokens: తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనం టోకన్లు దొరికేది ఇక్కడే

దర్శనం కోసం..

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల తిరుపతిలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చర్యలు తీసుకుంటున్నారు. తిరుపతి నగరంలో 9 ప్రాంతాల్లో వైకుంఠ ఏకాదశి ఉచిత దర్శన టికెట్లు జారీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో భక్తులు సహనం పాటించి తోపులాటకు ఆస్కారం లేకుండా టోకెన్లు పొందేవిధంగా చర్యలు తీసుకున్నారు. ప్రతిఒక్క భక్తుడు వైకుంఠ దర్శనం చేసుకునే విధంగా పటిష్ట ఏర్పాట్లు చేశారు.టికెట్లు ఇచ్చు కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో పర్యటించి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ఏర్పాట్లు, బ్యారికేడింగ్ పటిష్ఠమైన భద్రత కల్పించాలని అధికారులకు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అధికారులను ఆదేశించారు.

- Advertisement -

టిటిడి ఈవో శ్రీ.శ్యామలారావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో గౌతమి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్,విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్, స్థానిక పోలీస్ అధికారులతో కలిసి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు భద్రతపై సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పి సుబ్బరాయుడు మాట్లాడుతూ స్వామి వారి భక్తుల సౌకర్యార్థం తిరుపతి నగరంలో 9 ప్రాంతాలలో టోకెన్ జారీ చేయు కేంద్రాలను టీటీడీ ఏర్పాటు చేసిందని తెలిపారు. ఎటువంటి అవకాశం లేకుండా పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

10 రోజులపాటు

టిటిడిఈఓ శ్యామలరావు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలతో పాటు 10 రోజుల పాటు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు చేసుకొనే విధంగా ఏర్పాట్లను చేశామని తెలిపారు.స్థానిక ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి అశేష భక్త జనం వచ్చే అవకాశం ఉన్నందున భద్రతాపరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని వివరించారు. ఏకాదశి, ద్వాదశి రోజులే కాకుండా జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు మొత్తం 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం దర్శనానికి టీటీడి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పిలు వెంకట్రావు పరిపాలన, రవిమనోహర్ ఆచారి శాంతి భద్రత, గిరిధర ఎస్బి డిఎస్పి, తిరుపతి నగర పరిధిలోని డిఎస్పిలు, సిఐలు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News