Friday, November 22, 2024
Homeహెల్త్Women's day: మార్చి 8 నుండి రాష్ట్ర వ్యాప్తంగా 'ఆరోగ్య మహిళ'

Women’s day: మార్చి 8 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ‘ఆరోగ్య మహిళ’

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం “ఆరోగ్య మహిళ” కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు ఆరోగ్యశాఖా మంత్రి హరీష్ రావు వెల్లడించారు. మహిళలు ప్రధానంగా ఎదుర్కునే 8 రకాల ఆరోగ్య సమస్యలకి సర్కారు వైద్యం అందిచబోతోంది. ప్రతి మహిళ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర మహిళలకు బహుమతిగా దీన్ని అందించబోతున్నట్టు హరీష్ వెల్లడించారు. ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్య సేవలు ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు. మొదటి దశలో 100 ఆరోగ్య కేంద్రాల్లో, మొత్తం 1200 లకు విస్తరించాలనే ఆలోచనలో సర్కారు ఉంది.
1, మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు
2, ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్
3, థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం. అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతో పాటు, విటమిన్ బీ12, విటమిన్ డి పరీక్షలు చేసి చికిత్స, మందులు అందజేస్తారు.
4, మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు చేస్తారు.
5, మెనోపాజ్ దశకు సంబంధించి పరీక్షల అనంతరం అవసరమైన వారికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయడంతో పాటు కౌన్సిలింగ్ తో అవగాహన కలిగిస్తారు.
6, నెలసరి సమస్యలపై పరీక్షలు చేసి వైద్యం అందిస్తారు. సంతాన సమస్యలపై ప్రత్యే కంగా పరీక్షలు చేసి అవగాహన కలిగించడం, అవసరమైనవారికి ఆల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తారు.
7, సెక్స్ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు చేసి అవగాహన కలిగిస్తారు. అవసరమైన వారికి వైద్యం అందిస్తారు.
8, బరువు నియంత్రణ, యోగా, వ్యాయామం వంటివాటిపై అవగాహన కలిగిస్తారు.
ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలు, ప్రత్యేక యాప్ ద్వారా మానిటరింగ్ ఉంటుంది.
తెలంగాణ డయాగ్నొస్టిక్ ద్వారా 57 రకాల వైద్య పరీక్షలు చేస్తారు.
రెఫరల్ సెంటర్లు ప్రభుత్వ పెద్దాసుపత్రులు ఉంటాయి. సంబంధిత మహిళకు పూర్తిగా నయం అయ్యే దాకా వైద్య సేవలు అందించే కార్యక్రమం. రిఫరల్ ఆసుపత్రుల్లో మహిళలకు సేవలు పొందేందుకు వీలుగా ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఉంటాయి.
మొదటి విడతలో 100 ఆరోగ్య కేంద్రాల్లో, మొత్తంగా 1200 పీ హెచ్ సి, యూపిహెచ్సి, బస్తి దావాఖన లో.
మహిళా సంఘాలు, మెప్మా వారికి అవగాహన కల్పించేలా, మహిళా సంఘాలలో ప్రచారం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సర్కారు ఆదేశాలు జారీచేసింది. ఇప్పటివరకు చెప్పుకోలేక ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు చెప్పాలని, ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా పరీక్షలు, చికిత్స పొందాలని అందరికీ తెలియ చేయాలని సర్కారు చెబుతోంది.
సీపీఆర్ పై విస్తృత ప్రచారం
కరోనా తర్వాత సడెన్ కార్డియాక్ అరెస్ట్ కేసులు పెరిగినట్లు వైద్య నిపుణులు, పలు అధ్యయనాలు చెబుతున్న నేపథ్యంలో సీపీఆర్ పై పెద్ద ఎత్తున అవగాహన కల్పించే పనులు ప్రారంభించారు.
సమయం, సందర్భం, చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఎవరికైనా సడెన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌ వచ్చే ప్రమాదం ఉన్నందున సీపీఆర్ అవగాహనా కార్యక్రమాలపై సర్కారు ఫోకస్ పెట్టింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News