తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై(Annamalai) డీఎంకే(DMK) ప్రభుత్వంపై వినూత్నంగా నిరసన చేపట్టారు. చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో (Anna University) ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన దుమారం రేపుతోంది. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని అన్నామలై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు నిరసనగా రాష్ట్రంలోని ఆరు మురుగన్ క్షేతాలను దర్శించుకునేందుకు 48 గంటలపాటు ఉపవాస దీక్ష చేపడతానని తెలిపారు.
ఈ నేపథ్యంలో కోయంబత్తూర్‌లోని తన ఇంటి వద్ద బీజేపీ మద్దతుదారులు, మీడియా సమక్షంలో ఆరు కొరడా దెబ్బలు కొట్టుకుని మొక్కు చెల్లించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు చెప్పులు ధరించనని చెప్పారు.