Saturday, October 5, 2024
HomeతెలంగాణRamachandra Mission: 180 ఎకరాల భూమిని ట్రస్టుకు సమర్పించిన ఎర్రబెల్లి

Ramachandra Mission: 180 ఎకరాల భూమిని ట్రస్టుకు సమర్పించిన ఎర్రబెల్లి

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్ల వాడ గ్రామం గొట్ల కొండ కొండల మధ్య ఎర్రబెల్లి వారి కుటుంబాల తరపున తరతరాలుగా ఉన్న దాదాపు 180 ఎకరాల భూమిని కొలను శ్రీ వేంకటేశ్వర స్వామి ట్రస్టు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అప్పగించారు. ఈ మేరకు ఆ భూమికి సంబంధించిన పత్రాలను, మ్యాప్ లను శ్రీ రామచంద్ర మిషన్ కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ యోగా గురువు కమలేశ్ డి పటేల్ దాజీ కి మంత్రి పర్వతగిరిలో అందచేశారు.

అంతకు ముందు మంత్రి ఆ భూమిని స్వయంగా దాజీకి చూపించారు. తద్వారా అంతర్జాతీయ యోగా కేంద్ర ఏర్పాటుకు సుగమం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తరతరాలుగా తమకు వారసత్వంగా వస్తున్న భూమిని తమ ఎర్రబెల్లి ట్రస్టు ద్వారా ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. యోగా ఒక గొప్ప జీవన విధానమని, ప్రతి ఒక్కరి మానసిక ప్రశాంతతకు, ప్రపంచ శాంతికి, సౌభాగ్యానికి మూలమని, యోగాను విశ్వ వ్యాప్తం చేసి, అందరికీ పరివ్యాప్తం చేయాలనే సంకల్పంతోనే తాను ఈ మహాత్కార్యానికి పునుకున్నట్లు మంత్రి చెప్పారు.
కాగా, దాజీ మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీ రామచంద్ర మిషన్ ను తెలంగాణలో విస్తరించాలన్న ఆలోచనను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాణప్రదం చేశారని అన్నారు. ఎర్రబెల్లి సహకారంతో ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ యోగా కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News