భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్(Manmohan Singh) పార్థివదేహానికి కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ(Sonia Gandhi), మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ(Rahul Gandhi) నివాళులు అర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రియాంకా గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా సైతం మన్మోహన్ నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు. అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరంద్ర మోదీ(PM Modi), కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, అమిత్ షా నివాళులర్పించిన సంగతి తెలిసిందే.
కాగా శనివారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం మన్మోహన్ పార్థివదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే మన్మోహన్ సింగ్ మృతికి నివాళిగా దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించిన విషయం విధితమే.