మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) పార్థివదేహానికి ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) నివాళులర్పించారు. ఢిల్లీకి చేరుకున్న ఆయన నేరుగా మన్మోహన్ నివాసానికి చేరుకున్నారు. మన్మోహన్ పార్థివదేహం వద్ద అంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని, డాక్టర్ బైరెడ్డి శబరి కూడా నివాళులు అర్పించారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. దేశానికి మన్మోహన్ సింగ్ అవిశ్రాంతంగా సేవలందించారని ఆయన మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. తన సుదీర్ఘ ప్రస్థానంలో చేపట్టిన ఉన్నత పదవులను సమర్థవంతంగా నిర్వర్తించారని ప్రశంసించారు. తన హయాంలో ఉపాధి హామీ, ఆధార్, ఆర్టీఐ, విద్యా హక్కు చట్టం తీసుకువచ్చారని తెలిపారు.